టిడిపి ప్రభుత్వంతోనే పరిశ్రమలు సాధ్యం : టి.జి భరత్
1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని 6, 7 వార్డులకు చెందిన మున్నా, సుహేల్ భాషా, అబ్దుల్ రహమాన్ ల ఆధ్వర్యంలో యువత టిడిపిలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. ఎన్నికల సమయంలో కుల,మతాలు చూడొద్దని.. ప్రజలకు మంచి చేసేది ఎవరన్నది ఆలోచించాలని చెప్పారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ భాషా, వార్డు ఇంచార్జి ఇబ్రహీం, నేతలు మెహబూబ్, తదితరులు పాల్గొన్నారు.

