PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫీవర్​ సర్వే.. వేగవంతం చేయండి..

1 min read
మాట్లాడుతున్న ఇన్​చార్జ్​ కలెక్టర్​ రాం సుందర్​ రెడ్డి

మాట్లాడుతున్న ఇన్​చార్జ్​ కలెక్టర్​ రాం సుందర్​ రెడ్డి

శాంపిల్స్​ సేకరించే రోజే.. ల్యాబ్​కు పంపాలి
– జూమ్​ వీసీలో నోడల్​ అధికారులను ఆదేశించిన ఇన్​చార్జ్​ కలెక్టర్​ రాం సుందర్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: 104 కాల్ సెంటర్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక జెసి (రెవెన్యూ) మరియు జిల్లా ఇంఛార్జి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి శాంపిల్స్ సేకరణ, టెస్టింగ్, ఫీవర్‌ సర్వే, రిజల్ట్, షిఫ్టింగ్, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఆక్సిజన్, కోవిడ్ కేర్ సెంటర్, వ్యాక్సినేషన్ తదితర అంశాల పై కోవిడ్ -19 కమిటీ అధికారులతో జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోన కట్టడి చర్యల్లో భాగంగా ఫీవర్‌ సర్వే శాంపిల్స్ సేకరణ, టెస్టింగ్ ను వేగవంతం చేయాలని శాంపిల్స్ కలెక్ట్ టీమ్ మరియు టెస్టింగ్ టీమ్ ల్యాబ్ అధికారులకు ఇంఛార్జి కలెక్టర్ ఆదేశించారు. ఫీవర్‌ సర్వే శాంపిల్స్ కలెక్ట్ చేసి…లక్షణాలు ఉన్న వాళ్లను ఐసోలేటె చేసి హోమ్ ఐసోలేషన్ కిట్ అందించి వారి ఆరోగ్య స్థితిగతులపై పర్యవేక్షించాలన్నారు. పాజిటివ్ కేసు నమోదైతే వెంటనే కోవిడ్ కేర్ సెంటర్ కు తరలించేలా చర్యలు చేపట్టాలని షిఫ్టింగ్ టీమ్ కు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు.
జీజీహెచ్​లో జెర్మన్​ హేంగర్ల ఆస్పత్రి…
జిజిహెచ్ లో జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రి…ట్రాయేజ్ కోసం పెడుతున్నామన్నారు. అలాగే కర్నూలు, నంద్యాల టిడ్కో హొసింగ్ కాలనీ కోవిడ్ కేర్ సెంటర్ లో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని….ఆ పనులు వారంలోగా పూర్తవుతాయి సిద్ధంగా ఉంటాయి అన్నారు. తాత్కాలిక ఆసుపత్రిలో ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీఎంఐడిసి సదాశివ రెడ్డికి ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. జూమ్ వీసీ లో జెసి (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, కర్నూలు, ఆదోని ఆర్ డి ఓ లు హరిప్రసాద్, రామకృష్ణ రెడ్డి, కోవిడ్ – 19 నోడల్ కమిటీ అధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author