టిడిపి పార్టీ కో-కన్వీనర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే
1 min read

పార్టీఅండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా
పార్టీకి తేరా రమేష్ చేసిన సేవలు చిరస్మరణీయం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఇటీవల కన్నుమూసిన కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కో-కన్వీనర్,టెలికం బోర్డు సభ్యుడు తేరా రమేష్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో కలిసి పరామర్శించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పరామర్శించారు.కైకలూరు మండలం యామవరప్పాడులోని రమేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తేరా రమేష్ చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నరు.తేరా రమేష్ మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

