PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ ఆయుర్వేద వైద్య నిపుణులు దివి చిన్మయకు సత్కారం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: చెన్నై కు చెందిన “శ్రీ ఆయుర్ వేద ” ఆయుర్వేద వైద్య సంస్థ” దేశం లో ఆయుర్వేదం వైద్యం లో ఆరు తరాలుగా సేవలు అందిస్తున్న ఆయుర్వేద వైద్య నిపుణులను గుర్తించి ఆయుర్వేదం వైద్య వంశ విభూషణ్‌ పేరిట ఫిబ్రవరి 24 న చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలోఅవార్డులను అందచేశారు. ఈ నేపథ్యంలో ఉయ్యూరు కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ,యూనివర్సల్ ఫర్ ఆయుర్వేద చైర్మన్ డాక్టర్ దివి చిన్మయ గారు ” శ్రీ ఆయుర్ వేద ” సంస్థ వారి నుండి ఆయుర్వేద వైద్య వంశ విభూషణ్‌ అవార్డు నుఅందుకున్నారు.ఈ సందర్భంగా శనివారం స్థానికంగా డాక్టర్ చిన్మయగారిని కలిసిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఆయనను అభినందిస్తు చిరు సత్కరం చేశారు. కార్యక్రమంలో రాజులపాటి జగదీష్, సురేష్,నాగరాజు పాల్గొన్నారు.

About Author