NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సామాన్యులు ఎమ్మెల్సీగా ఎన్నికైతే ప్రజాస్వామ్యానికి మనుగడ

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సామాన్యులు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక అయితే ప్రజాస్వామ్యానికి మనగడం ఉంటుందని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి. వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం నందికొట్కూరు పట్టణ ప్రభుత్వ హాస్పిటల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహా రెడ్డి పశ్చిమరాయలసీమ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో ఉన్నారని వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని ఆసుపత్రి వైద్యులను, సిబ్బందిని కోరారు. పిడిఎఫ్ అలాగే198 ఉద్యోగ ఉపాధ్యాయ వామపక్ష ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేశారని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల సమస్యలను ప్రశ్నించి ఈ ప్రాంతం సమస్యలను శాసనమండలిలో నిలదీసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని అటువంటివారిని శాసనమండలి కి ఎన్నుకుంటే ప్రజల పక్షాల ఉండి మాట్లాడతారని వివరించారు. ప్రశ్నించే వారిని శాసనమండలికి పంపించాలని పోతుల నాగరాజు బ్యాలెట్ నమూనా 27 నెంబర్ పై తమ ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో మొదటి ప్రాధాన్యతఓటుతో గెలిపిస్తారని ఓటర్లను కోరుతూ హాస్పిటల్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్జీవోస్ తాలూకా కార్యదర్శి సత్యనారాయణ, ఎక్స్ రే డాక్టర్ నవీన్, నరేష్, మెడికల్ హెల్త్ కృష్ణమూర్తి. స్టాఫ్ నర్స్ శారద వాచ్ మెన్ సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

About Author