ఈ సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీ అంచెలంచెలుగా ఎదగాలి
1 min read– విజయ పాల డైరీ చైర్మన్ శ్రీ ఎస్ వి జగన్మోహన్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలుకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ 8-3-2023వ తేదీ ఉదయం 11 గంటలకు కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్ దగ్గర గల లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపంలో వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ పాల డైరీ చైర్మన్ శ్రీ ఎస్ వి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కర్నూలు నగరానికి చెందిన ఈ సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీ అంచెలంచెలుగా ఎదగాలని కోరారు. కర్నూల్ నగరం నిజంగా ఐటీ హబ్ కావలసిన అన్ని అర్హతలు గల నగరమని ఇటువంటి నగరంలో ఎన్నో కంపెనీలు రావలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కంపెనీ అధినేత శ్రీ మాళిగి వేదవ్యాస మూర్తి గారు మాట్లాడుతూ ఈ కంపెనీ కర్నూల్లో ప్రారంభమై, బెంగళూరులో వికసిస్తూ దేశ దేశాలకు చెందిన ఎంతోమంది ఇంజనీర్లను కలుపుకుంటూ ఐటీ రంగంలో ప్రముఖంగా ముందుకు వెళుతుందని తెలియజేశారు. కర్నూల్ టెక్ కంపెనీ యొక్క మొదటి వార్షికోత్సవంలో శ్రీ రమేష్ దేశ్పాండే గారు, శ్రీ సముద్రాల హనుమంతరావు గారు, శ్రీ గాడి చర్ల ప్రదీప్ గారు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కట్ట రాఘవేంద్ర ప్రసాద్, శ్రీ రవి, శ్రీ ఎం భాను ప్రకాష్, శ్రీ పవన్ కుమార్, శ్రీ ధృవరాజ్ ,శ్రీమతి సంధ్యా మూర్తి ,శ్రీమతి విద్యా,తదితరులు పాల్గొన్నారు.