PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధార్ కార్డుల అప్డేట్ పై ప్రజలకు అవగాహన కల్పించండి

1 min read

– జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆధార్ కార్డుల అప్డేట్ పై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు గారు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.శుక్రవారం కర్నూలు నగరంలోని రామచంద్ర నగర్,శారదానగర్,ఉద్యోగ నగర్, లలోని72వ 73వ మరియు74వ వార్డు సచివాలయలను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు గారు ఆకస్మికంగా తనిఖీ గావించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ కార్డుల అప్డేట్ పై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించి ఆధార్ కార్డుల అప్డేట్ కొరకు సచివాలయంలో ప్రత్యేక క్యాంపింగ్ నిర్వహించి ఆదార్ కార్డులు అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.పిఎంజెఏవై కార్డులకు సంబంధించిన వివరాలను వాలంటీర్ల చేత సేకరించి అందరికీ పిఎంజెఏవై కార్డులను అందజేయాలన్నారు. సచివాలయ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అవుతున్నాయా వసూలైన పైకమును ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తున్నారా అని సిబ్బందిని ఆరా తీయగా ట్యాక్స్ వసూల్ అవుతుందని వసూలు అయిన నగదును ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తున్నామని సిబ్బంది కలెక్టర్ గారికి తెలియజేశారు.సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 10 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయిలకు మరియు సచివాలయ పరిధిలో ఉన్న ప్రెగ్నెన్సీ మహిళలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహిస్తున్నారా అని కలెక్టర్ అడ్మిన్ ను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ పరిధిలో పారిశుద్ధ్య పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు సకాలంలో విధులకు వస్తున్నారా అని కలెక్టర్ అడిగారు అందుకు స్పందించిన సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు వచ్చి వీధులను శుభ్రం చేస్తున్నారని కలెక్టర్ గారికి వివరించారు.వీక్లీ వర్క్స్ కి సంబంధించిన లిస్ట్ తయారు చేసి వాలంటీర్లకు లిస్ట్ ఇచ్చి పనులు పెండింగ్ లో లేకుండా చూడాలని అడ్మిన్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కన్సిస్టెంట్ రిథమ్ కి సంబంధించి ఈ సచివాలయ పరిధిలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయని, విజిట్ కి వెళ్ళినప్పుడు ఏవైనా సమస్యలు కనిపిస్తే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారా లేదా అని సచివాలయ సిబ్బందిని ఆరా తీయగా విజిట్ కి వెళ్తున్నామని సమస్యలు కనిపిస్తే ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నామని సచివాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం సచివాలయంలోని హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, తదితర రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

About Author