వీరభద్రాలయంలో రాహుకాల పూజలు
1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లాలో రాయచోటి పట్టణంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీమతి పోలంరెడ్డి విజయమ్మ గారు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ డివి రమణారెడ్డి గారు మరియు పాలక మండలి సభ్యులు, ఆలయ అర్చకులు శంకరయ్య స్వాములు భద్రకాళీ అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి,ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.అనంతరం రాయచోటి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలను చేపట్టారు.ఈ సందర్భంగా రాహుకాల పూజ విశిష్టతను భక్తులకు వివరించి వచ్చిన భక్తులందరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అని ఆలయ ఈవో డివి రమణ రెడ్డి గారు తెలియజేశారు.


