ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి.. వినతి పత్రం అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: 21న డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా సిఐటియు,మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న , ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 21వ తేదీన డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి చెన్నమ్మ మాట్లాడుతూ , శుక్రవారం గదివెముల పీహెచ్ఎస్సి లో మండల వైద్యాధికారినికి శుక్రవారం నాడు ఆశ వర్కర్లు అనుమతితో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి చెన్నమ్మ మాట్లాడుతూ, ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 వేలు ఇవ్వాలని 14 సంవత్సరాలుగా గ్రామస్థాయిలో గర్భవతులకు, బాలింతలకు, పసిపిల్లలకు సంరక్షణతో పాటు ఆసుపత్రిలో కాన్పులు చేయించడం, కుటుంబ నియంత్రణ, మరియు టిబి , మలేరియా, పైలేరియా, లెప్రసీ, బోదకాలు వంటి రోగాలకు కూడా అందుబాటులో ఉండి నిరంతరం సేవలు అందిస్తున్నారు, పరిసరాల పరిశుభ్రతను ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాములను నిర్వహిస్తూ, హౌస్ హోల్డ్ సర్వేలు, స్కూల్ అండ్ హెల్త్ సర్వేలు, నిరంతరం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆశలతో పారితోషికం పేరుతో ఆశ వర్కర్లను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు, పనికి తగ్గ వేతనం అందకపోవడం సరైనది కాదన్నారు, ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు, ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 21న డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభావతి, మహేశ్వరి, ఆశాబి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.