మత్తే బాబికి విశిష్ట సేవా పురస్కారం..
1 min read– శుభాకాంక్షలు తెలియచేసిన ఉరువులు ప్రముఖులు..
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఏలూరు వాసి సామాజిక ఉద్యమకారుడు యువ జర్నలిస్టు మత్తే బాబి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని విశిష్ట సేవా పురస్కారం అందుకున్నారు. ఫిలాంత్రోపిక్ సొసైటి ఆప్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ అద్దంకి రాజా ప్రతిసంవత్సరం ఉగాది, అంబేద్కర్ జయంతి లను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా విశిష్ట సేవలను అందిస్తున్న వ్వక్తులను గుర్తించి వారికీ గౌతమ బుద్ధ నేషనల్ ఫెలోషిప్ అవార్డులను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని విశిష్ట సేవా పురస్కార కార్యక్రమాన్ని విజయవాడలోని హోటల్ ఐలాపురంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ముఖ్య అథిదిగా హాజరయ్యారు. ఈసందర్భంగా అయన అవార్డు గ్రహీతలకు సత్కారం చేసి పురస్కారాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవార్డు గ్రహీతలకు తన శుభాకాంక్షలను తెలిపారు. అవార్డులు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి సమాజంపై మరింత బాధ్యత పెరుగుతిందన్నారు. ప్రతి ఏటా ఫిలంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ అవార్డులు ఇవ్వడం సాధారణమైనటువంటి అంశం కాదన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా చాలా మంది ప్రజా సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. అటువంటివారిని గుర్తించి వారికీ మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను ఫిలంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా చేస్తుందన్నారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఫిలంత్రోఫీక్ సొసైటీ ఆఫ్ ఇండియా చేస్తున్న సేవలు అభినందనీయమని కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. ఇటువంటి పురస్కారాలు గతంలో అనేకం బాబి స్వీకరించి ఉన్నారని గుర్తు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు, విశిష్ట అతిధులు, పురస్కార గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.