అర్థర్ కాటన్ దొర 221 వ జయంతి వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో గోదావరి జిల్లా లకు అన్న దాత సర్ ఆర్థర్ కాటన్ దొర 221 వ జయంతి ని రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ NGOs అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్( పరిపాలన) రేవు సతీశ్ కుమార్ పాల్గొని కాటన్ మహాశయునికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు..కరువు జిల్లాలకు ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి 10 లక్ష ల ఎకరాలకు సాగు నీరు అందించి ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన గొప్ప దార్శినికులని కాటన్ ని కొనియాడాని సతీశ్ కుమార్. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లు ముక్కామల వెంకట కృష్ణా రావు. ఏనుగపల్లి శ్రీరామ మూర్తి ,తనికెళ్ల రామకృష్ణ.ఇరిగేషన్ సర్కిల్ డిప్యూటీ SE రత్న రమేష్ , RMC డిప్యూటీ SE కె.రాజు, RMC ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గురు ప్రసాద్,, డీఈఈ అర్జున్.JE లు మిదిలేష్ ,త్రిపుర ప్రియదర్శిని,నాగ వల్లీశ్వరి, ఉషా,, భవాని.. ఫాతిమా.జె ఏ సి నాయకులు ఆర్ ఎస్ హరనాధ్,ఎన్జీవో సంఘ నాయకులు నెరుసు రామారావు, పూడి శ్రీనివాస్. రవి కుమార్,ఫణి కుమార్.తెర్లీ జయరాజు.జలవనరుల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.