ప్రజా సేవకు టీజీవి సంస్థలు ముందుంటాయి : టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సేవా కార్యక్రమాలు చేయడంలో మా టీజీవి సంస్థలు ఎప్పుడు ముందుంటాయని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, టీజీవి సంస్థల చైర్మన్ టిజి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని ఎండోమెంట్ గోశాలలో గ్రానైట్ బండ పరుపు అవసరమైన నేపథ్యంలో టీజీవి సంస్థల నుండి రూ. 5 లక్షలు విరాళం ఇచ్చి టిజి భరత్ గ్రానైట్ బండ పరుపు వేయించారు. గురువారం ధన్వంతరి హోమం నిర్వహించి టిజి భరత్ చేతుల మీదుగా గ్రానైట్ బండ పరుపును ప్రారంభించారు. ఈ గ్రానైట్ బండ పరుపు వేయించడం వల్ల హోమాలు, భజనలు నిర్వహించుకోవడానికి ఎంతో వీలుంటుందని గోశాల నిర్వహకులు భరత్ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ఆయన ఒప్పుకున్నారని గోశాల నిర్వాహకులు తెలిపారు. టిజి భరత్ మాట్లాడుతూ సమాజంలో పదిమందికి ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా చేసేందుకు మా టీజీవి కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. గాయత్రి గో సేవా సమితి సమన్వయం వల్లే ఇది సాధ్యపడిందన్నారు. ఒక చిన్న గోశాలగా ప్రారంభమైన గాయత్రి గోశాల నేడు దాదాపు వెయ్యి గోవులకు చేరువలో అక్కడ ఉండే విధంగా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను భరత్ అభినందించారు. గాయత్రి గోశాల దక్షిణ భారతదేశంలోనే ఒక గొప్ప గోశాలగా తయారవుతుందన్నారు. పది మందికి మంచి చేయడమే మా కుటుంబ ఉద్దేశమని ఇది అందరూ గుర్తుంచుకోవాలన్నారు భరత్. గాయత్రి గోశాల నిర్వాహకులు మాట్లాడుతూ గోసేవ కోసం టిజి భరత్ ఎంతో సహాయం చేస్తున్నారని అన్నారు. ప్రతి నెలా రూ. 15 లక్షల దాకా ఖర్చవుతుంటే సగానికి పైగా టిజి భరత్ తరుపున అందుతుందని తెలిపారు. కుల మతాలకు అతీతంగా సేవ చేస్తున్న టిజి కుటుంబాన్ని కర్నూలు ప్రజలు ఆదరించాలని, గోమాత ఆశీస్సులు వారిపై ఉండాలని కోరుకుంటున్నట్లు గోశాల నిర్వాహకులు అన్నారు. ఈ కార్యక్రమంలో అవోపా నాగేశ్వరరావు, గాయత్రి గోశాల అధ్యక్షుడు జగదీష్ గుప్త , గౌరవ అధ్యక్షుడు విజయ్ కుమార్, ట్రెజరర్ ఇల్లూరు రాజ్యలక్ష్మి, మాజీ పాలక మండలి సభ్యులు శ్రీకాంత్, అవోపా సభ్యులు, గాయత్రి గోసేవ సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.