PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్ని దానాల కన్నా రక్తదానమే మిన్న

1 min read

రక్త దాతలు ప్రాణదాతలే… ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాలు

పల్లెవెలుగు వెబ్ కౌతాళం:    రక్త దాతలు ప్రాణదాతలే అని ప్రతి నీటి చుక్క ఎంత అవసరమో ప్రతి రక్తపు బొట్టు కూడా అంతే అవసరం చాలా మంది రక్త దాతలు ప్రాణదాతలుగ మిగిలారని వారి సహనం అభిమానం, వారి సేవలు అమోగమని ఎన్టీఆర్ సేవా సంఘం అభిమానులు మరియు నాయకులు ఈడిగ బసవరాజు పేర్కొన్నారు. శనివారం కృష్ణ అవధూత ఆశ్రమంలో ఏర్పాట్లు చేసిన రక్తదాన శిబిరం  ప్రాంగణంలో  ఎన్టీఆర్ జన్మదిన శుభ సందర్భంగా అక్షయ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో  ఎన్టీఆర్ సేవ సమితి ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి తమ వంతు సేవలు అందించడానికి అక్షయ బ్లడ్ వారి సహాకారులతో అభిమానులు అందించారు. వారి అభిమానానికి మరువలేమని పేర్కొన్నారు. అనంతరం రక్తదాతలు ఇచ్చిన వారిని శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా అభిమానుల మధ్య కేకును కట్ చేసి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ జిల్లాలో 180 మంది పిల్లలు తలెసేమియాతో వ్యాది తో బాధపడుతున్నారని వారికి ఎన్టీఆర్ సేవ సమితి నుంచి సహాయ సహకారాలు అందించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు. బాధపడుతున్న వారికి 25 నుంచి 30 రోజుల్లో బ్లేడ్ ను మార్పిడి  వారికి ఎంతో మేలు జరుగుతుందని తమ వంతు సహకారంతో నెలకు 80 నుంచి 100 వరకు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడిగ నాగరాజ్ గౌడ్, మరియు ఉమేష్ మరియు యూసుఫ్, మాట్లాడుతూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి తమ వంతుగా బ్లడ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అభిమానుల మధ్య ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. దాదాపు 30 నుంచి 35 మంది అభిమానులు బ్లడ్ ఇవ్వడం ఆనందకర విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి శ్రీకాంత్ మరియు ఇన్చార్జ్ సురేష్ మరియు విజయ్ అభిమానులు  జనార్ధన్, ముకయ్య గౌడ్ ,రమేష్ వీరేష్ తదితరులు అభిమానులు పాల్గొన్నారు.

About Author