PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దీప బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో:  అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని దీపా బ్లడ్ బ్యాంకులో హెల్పింగ్ హాండ్ వ్యవస్థాపకుడు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా సీనియర్  వైసీపీ నాయకులు పారిశ్రామికవేత్త  శ్రీనివాసులు  రెడ్డి గారు (కోడిశీన) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ ని యువకులు మరియు ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని వేసవి కాలాన్ని సైతం లెక్కచేయకుండా అత్యవసర సమయంలో ప్రజలకు రక్త కొరత ఉండకూడదన్న ఆలోచనలతో 59 మంది దీప బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయడం అభినందనీయం. ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం రెండుసార్లు అయినా తమ రక్తాన్ని బ్లడ్‌ బ్యాంకులకు దానం చేస్తే ఎంతో మంది క్షతగాత్రులకు, ఆపదలో ఉన్న రోగులకు ఉపయోగపడుతుందని అన్నారు. రక్తదానం చేయడం వల్ల వ్యక్తుల ఆరోగ్యం సక్రమంగా ఉండడంతో పాటు ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడంలో అపోహలు మాని ప్రాణ హానిలో ఉన్న రోగులకు సహాయం చేసే వారవుతారని పేర్కొన్నారు. వేసవికాలంలో రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని సూచించారు.  ఈ కార్యక్రమములో సుబ్బారెడ్డి, రెడ్డయ్య యాదవ్ , హెల్ప్ంగ్ హ్యoడ్స్ ఛైర్మన్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ రక్త ధాతలు అర్షద్, షహీల్, మహమ్మద్, సుఫియాన్ సమీర్, అబుజార్, నవాజ్ ,మహమ్మద్ సుబహాన్,ఆసిఫ్, ఫిరూజ్, జబివుల్లా,షాబుద్దీన్,షారుఖ్ ఖాన్, ఉమర్, నూర్, మరియు బ్లడ్ నిధి సిబ్బంది పాల్గొన్నారు.

About Author