పెండింగ్ లో ఉన్న పాఠ్యపుస్తకాలను అందించండి..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మహానంది డిమాండ్ చేశారు.స్థానిక నందికొట్కూరు పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ తాలూకా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాల ముందు విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు గెలుస్తున్న ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని , పాఠ్యపుస్తకాలు లేకపోవడం వల్ల అధ్యాపకులు ఏ విధంగా పాఠాలు బోధిస్తారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు 40% ఇంకా పాఠ్యపుస్తకాలు రావాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు విద్యా రంగానికి పెద్ద పీట వేస్తామని చెపుతూనే మరోపక్క పాఠ్యపుస్తకాలు మంజూరు చెయ్యలేకపోవడం విడ్డూరంగా ఉందని విద్యార్థులకు ఇచ్చే రెండు జతల యూనిఫాం కు కుట్టుకూలీ మాత్రం 300 రూపాయలుగా అతి తక్కువ కూలి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని 300రూపాయలకు ఏ విధంగా రెండు జతల యూనిఫామ్ కుట్టించుకుంటారని మండిపడ్డారు పేద విద్యార్థులపై చిన్నచూపు చూడకుండా వారికి రావలసిన సౌకర్యాలను తక్షణమే కల్పించాలన్నారు లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు వీరేంద్ర, వినోద్ మరియు ముత్తు రఫీ అభి, విద్యార్థులు పాల్గొన్నారు.