ప్రజలందరికీ.. టీకా ఉచితంగా ఇవ్వండి..
1 min read– కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా డీసీసీ అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: దేశ పౌరులందరికీ వ్యాక్సినేషన్ ఉచితంగాఇవ్వాలని, కరోన నియంత్రణకు ఇదొక్కటే మార్గమని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా డీసీసీ అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్ అన్నారు. కోవిడ్ నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపించారు. వ్యాక్సినేషన్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… శుక్రవారం డీఆర్వో పుల్లయ్య కు లక్ష్మినరసిహ యాదవ్ వినతిపత్రం అందజేశారు కరోనా రెండో దశ ఇప్పటికే విస్తృతంగా వ్యాపించిందని, మూడో దశ కూడా వచ్చే ప్రమాదం ఉందని ఐసిఎంఆర్ వెల్లడిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి దేశ ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియను పూర్తిచేయాలని ఈ సందర్భంగా లక్ష్మి నరసింహ యాదవ్ కోరారు . ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు బాలస్వామి, మంత్రాలయం నియోజవర్గ ఇన్ఛార్జి బాబురావు , సీనియర్ నాయకులు లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.