ఆర్బీఐ ప్రకటనతో నష్టాల్లోకి స్టాక్ మార్కెట్
1 min read

పల్లెవెలుగు వెబ్: ఆర్బీఐ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు .. కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచనున్నట్టు ఆర్బీఐ ప్రకటించడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 15670 వద్ద ట్రేడింగ్ ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 305 పాయింట్లు నష్టపోయి.. 35300 వద్ద ట్రేడింగ్ ముగిసింది. సెన్సెక్స్ 132 పాయింట్ల నష్టంతో 52100 వద్ద ట్రేడింగ్ ముగిసింది. కరోన రెండో దశ నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు అయిన రెపో రేట్, రివర్స్ రెపో రేట్ లను యథాతథంగా ఉంచింది.

