ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
1 min read– రాయచోటి ట్రాఫిక్ ఎస్ఐ రఫీ
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో : ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ కలిగి ఉండాలని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ట్రాఫిక్ ఎస్ఐ రఫీ అన్నారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ … వాహనదారులు విధిగా హెల్మెట్ ను ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల కొంతవరకు తమ ప్రాణాలను కాపాడుకోవచ్చునన్నారు.మైనర్ యువకులు బైక్‌లు నడిపితే ఆ బాధ్యత తల్లిదండ్రులే వహించవలసి వస్తుందని, యువకులు బైక్‌లను మితిమీరిన వేగంతో నడిపితే లైసెన్స్‌తోపాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పాదుచారులు రోడ్డు దాటేటప్పుడు రోడ్డుకు ఇరువైపులా చూసుకొని దాటాలి. రాంగ్ రూట్లో వాహనాలు నడపరాదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు అన్నారు. ఫుట్‌పాత్‌ల పై దుకాణదారులు ఆక్రమిస్తే భారీ జరిమానా విధించనున్నారు.నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని కోరుతున్నారు.