PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా గిడుగు వెంకట రామమూర్తి జయంతి..

1 min read

వైభవంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు..

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు:  నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పెద్ద కబేలా వీధిలోని చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు మంగళవారం గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ0లో స్కూల్ కరస్పాండెంట్ A.తాజుద్దీన్ గారు తెలుగు ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయులతో  కలిసి గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం  పాఠశాల  కరెస్పాండెంట్ తాజుద్దీన్ గారు మరియు తెలుగు ఉపాధ్యాయుడు దర్గయ్య గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగులో వాడుక భాష ఉద్యమ పితామహుడు, వ్యవహరిక భాషోద్యమానికి మూల పురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది, అచ్చ తెలుగు చిచ్చరపిడుగు గిడుగు రామమూర్తి గారు అని అన్నారు. ఆయన 1863 ఆగస్టు 29వ తేదీన శ్రీకాకుళానికి ఉత్తరాన 20 మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాల పేట అనే గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ అనే దంపతులకు జన్మించాడు. తండ్రి రెవిన్యూ అధికారిగా పనిచేసేవాడు. రామమూర్తి ప్రాథమిక విద్య స్వగ్రామంలోని పూర్తిచేసిన అనంతరం విజయనగరంలో మేనమామ ఇంట్లో ఉంటూ ఉన్నత విద్యను పూర్తి చేశాడని అన్నారు. తర్వాత మెట్రిక్ లో చేరి ఉత్తీర్ణుడయ్యాడని, 1820లో పర్లాకిమిడి రాజావారి స్కూల్లో ఫస్ట్ ఫారంలో చరిత్ర బోధించే అధ్యాపకుడిగా 30 రూపాయల వేతనంతో విధుల్లో చేరాడని తెలిపారు. ఆయనకు ప్రభుత్వం 1913లో రావు సాహెబ్ అనే బిరుదు ఇచ్చి గౌరవించగా, 1934లో కైజర్ ఏ హింద్ అనే బిరుదు ఇచ్చి సత్కరించిందన్నారు. అంతేగాక 1938లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కళా ప్రపూర్ణతతో గౌరవించడం జరిగిందన్నారు.” తేట తేనెల తెల్లని పాలమీగడ గిడుగు, కూరి తెలుగు భాషకు గిడుగు గొడుగు”. ఆ గొడుగు కింద మనమంతా ఉన్నామని వివరించారు. ఆయన తెలుగు భాష కోసం చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. 1940 జనవరి 22వ తేదీన కన్నుమూశాడు. ఆయన పుట్టినరోజును ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవం గా ప్రకటించి నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునీ , ఉపాధ్యాయులు విద్యార్థినీ , విద్యార్థులు ఉన్నారు.

About Author