వైయస్సార్ భీమా తక్షణ సహాయం అందజేత..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : గంగమ్మ కట్ట వద్ద నివాసముండే సిరివెళ్ల జమ్మూలయ్య అనే వ్యక్తి గత రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించడంతో వైయస్సార్ భీమా తక్షణ సహాయం కింద నామిని అయినా మృతుడి భార్య సిరివెళ్ల సాలమ్మకు బుధవారం నాడు ఉప సర్పంచ్ బాలచెన్ని చేతుల మీదుగా పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు మిగతా 90 వేల మొత్తాన్ని మూడు నెలల లోపు నామిని ఖాతాలో జమ చేస్తామని వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ తెలిపారు ఈ కార్యక్రమంలో వాలంటీర్. విజయ పాల్గొన్నారు.