NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండల వాసికి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీటు

1 min read

చెన్నూరు: మండలంలోని రామనపల్లి గ్రామానికి చెందిన లింగం దీన్నే సుబ్బరామిరెడ్డి పద్మావతి దంపతుల కుమార్తె లింగం దిన్నె వరలక్ష్మికి కడప రిమ్స్ డెంటల్ కాలేజ్ నందు ఎంబిబిఎస్ సీటు  వచ్చినట్లు, వరలక్ష్మి సోదరుడు బద్రీనాథ్ రెడ్డి తెలిపారు, శుక్రవారం సాయంత్రం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, వరలక్ష్మి ఎంతో క్రమశిక్షణతో 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు కడప గురుకుల్ విద్యాపీఠం నందు చదవడం జరిగిందన్నారు, తదుపరి ఇంటర్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కడప లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిందని తెలిపారు, నీట్ లో 570 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ 48 887 ద్వారా గత ఏడాది నీట్ పరీక్ష ద్వారా గవర్నమెంట్ డెంటల్ కాలేజీ కడప నందు, వెటర్నరీ కాలేజీ వరంగల్ నందు సీటు రావడం జరిగిందన్నారు, వరలక్ష్మి నిరుత్సాహపడకుండా వెటర్నరీ చదువుతూనే మళ్లీ ఈ సంవత్సరం నీట్ పరీక్ష రాసి విజయం సాధించిందని, గవర్నమెంట్ కాలేజీ కడప రిమ్స్ లో సీటు సాధించడం జరిగిందని తెలిపారు, దీంతో తన తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చి కుటుంబం గర్వపడేటట్లు చేసిందని తెలిపారు. గ్రామస్తుల అభినందనలు:- వరలక్ష్మి కష్టపడి చదివి ఎంబిబిఎస్ సీటు సాధించినందుకు గ్రామస్తులు ఆమెకు అభినందనలు తెలిపారు, మా ఊరి ఆడబిడ్డ ఎంబిబిఎస్ నందు సీటు సాధించడం తమకు ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.

About Author