మాట తప్పడం.. మడమ తిప్పడం.. వైసీపీ ప్రభుత్వ లక్ష్యం
1 min read– టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ ధ్వజం
పల్లెవెలుగు వెబ్, కమలాపురం : శాసనసభ ఎన్నికలకు ముందు కల్లబొల్లి మాటలతో ప్రజలను ఒక్కసారి ఛాన్స్ అంటూ నమ్మించి మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాట తప్పడం.. మడమ తిప్పడం.. ఆనవాయితీగా మారిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయి నాథ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి రహిత, పారదర్శక పాలన అంటూ చెప్పుకునే సీఎం జగన్… రాష్ట్రంలో ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా దందాలు చేస్తున్నా.. ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాఫియాదారులకు సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులను కూడా వెనకేసుకు రావడం చాలా విచారకరమన్నారు. 151 మంది సభ్యులు ఉన్న శాసనసభలో శాసన మండలి రద్దు కు తీర్మానం చేసి సిగ్గులేకుండా మరల తమ పార్టీ నాయకులను ఎమ్మెల్సీలు గా నామినేట్ చేయడం జగన్మోహన్ రెడ్డికి తగునా అని ఆయన విమర్శించారు. సీఎం జగన్ ఒంటెద్దు పోకడలతో … ఎమ్మెల్సీగా నామినేటెడ్ చేస్తుండటం మాట తిప్పడం.. మడమ తిప్పడం కాదా.. అని ఆయన ఘాటుగా విమర్శించారు.