యాగంటి ఆలయ చైర్మన్ గా తోట బుచ్చిరెడ్డి
1 min read

పల్లెవెలుగువెబ్, బనగానపల్లె: తిరుమల కొండల్లో వెలసిన యాగంటి ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్గా మండలంలోని మీరపురం గ్రామానికి చెందిన తోట బుచ్చిరెడ్డి నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అధికారులకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ కారణంగా ఆలయ చైర్మన్ ఎంపికపై ఆలస్యమైనట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తోట బుచ్చిరెడ్డి మాట్లాడుతూ యాగంటి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాటసాని వంశీయులు, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సహకారంతో పదవి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి న్యాయం చేస్తానని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

