డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్
1 min readపల్లెవెలుగు వెబ్: 2008 డీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగంలోకి తీసుకుని .. మినిమం టైం స్కేల్ అందించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. డీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థుల వినతి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో 2008 డీఎస్సీ అభ్యర్థులు సీఎంను కలిశారు. 2193 మందిని ఒప్పంద పద్ధతిలో విధుల్లోకి తీసుకోనున్నారు. కోర్టు కేసులతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో సాధ్యమైనంత సహాయం చేస్తామని సీఎం హామి ఇచ్చినట్టు డీఎస్సీ అభ్యర్థులు తెలిపారు.