PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి సానుభూతిపరుల ఓట్లు గల్లంతవుతున్నాయి.. టి.జి భరత్

1 min read

15 రోజులకోసారి ఓట్లను చెక్ చేసుకోవాలన్న టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. కర్నూల్లోని ధర్నా చౌక్ వద్ద టిడిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ఎలాంటి ప్రూఫ్ లేకుండా అరెస్టు చేసిన కేసు ఇండియాలో ఇదే కావచ్చన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. రాష్ట్రంలో పన్నులు పెరిగాయని, కరెంట్ బిల్లు పెరిగిపోయిందన్నారు. పేదలకు మూడు పూటలా అన్నం పెట్టే అన్న క్యాంటిన్లు మూతపడ్డాయన్నారు. ఒక పించన్ దారుడు మూడు పూటలా అన్న క్యాంటిన్లలో అన్నం తింటే ఇంకా రూ. 500 కి పైగా మిగిలేదన్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు ఉన్నాయో లేదో ప్రతి 15 రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని,  కర్నూల్లో తాను ఎమ్మెల్యే అయితే రాష్ట్రంతో పాటు కర్నూలు అభివ్రుద్దిలో ముందుకెళుతుందన్నారు. తాను గెలిస్తే కర్నూలుకు పరిశ్రమలు తీసుకువస్తానన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ వచ్చిన సమయంలో కర్నూలును ఫార్మాసిటీ చేద్దామని తనతో అన్నారన్నారు. చంద్రబాబు కూడా కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని చెప్పారన్నారు. లాయర్లు ఆలోచించాలని, కర్నూలుకు హైకోర్టు రావడం అంత సులువు కాదన్నారు. ఇది సుప్రీంకోర్టులో తేలాల్సిన అంశమన్నారు. టిడిపి వస్తే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకురావడం తన బాధ్యతన్నారు. అందుకే ప్రజలందరూ ఆలోచించి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ రవణమ్మ, నేతలు నాగరాజుయాదవ్, అబ్బాస్, రాజ్యలక్ష్మి, రాజశేఖర్ యాదవ్, రామాంజనేయులు, చంద్రశేఖర్, వినోద్, బాలు, ఏసు, మహేష్, ప్రభాకర్, సుంకన్న, రాజశేఖర్ రెడ్డి, ప్రసాదరావు, శారదమ్మ, అఖిల్, శివ, తదితరులు పాల్గొన్నారు.

About Author