ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..
1 min read– దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే..
– జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : జిల్లా పరిషత్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సమావేశ మందిరంలో గురువారం జరిగిన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల అన్ని ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొని నేటి బాలలే రేపటి పౌరులు గా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల ద్వారానే దేశ భవిష్యత్తు ముందడుగు వేయటం జరుగుతుందన్నారు. చైర్ పర్సన్ దంపతులను ఉపాధ్యాయ సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ , గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీమతి టీ. కల్పలత రెడ్డి కూడా ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంఘ నాయకులు వివిధ ఉద్యోగ సంఘ నాయకులు,ఉపాధ్యాయలు తదితరులు పాల్గొన్నారు.