NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చికిత్స పొందుతున్న నరసింహులును పరామర్శించిన కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని సర్వజన వైద్యశాల సూపర్ స్పెషాలిటీ బ్లాక్ న్యూరాలజీ వార్డులో చికిత్స పొందుతున్న నరసింహులు (41) ను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పరామర్శించారు. అనంతపురం జిల్లా బెడుగుప్ప మండలం ఆవులెన్న గ్రామానికి చెందిన రైతు, నరసింహులు ఈ సంవత్సరం మే 28న కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై జ్ఞాపకశక్తి కోల్పోయారు. వీరి కుటుంబం ఆర్థిక సహాయం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని  ఎమ్మిగనూరు పర్యటనలో కలిసి విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ నరసింహులును పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు సర్వజన వైద్యశాలలో గత మూడు వారాలుగా నరసింహులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. అవసరమైన చికిత్సను డాక్టర్లు అందిస్తున్నారని పేర్కొన్నారు. వేరెక్కడైనా అత్యున్నతమైన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ కుటుంబ సభ్యులను వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్స్  సంబంధిత అధికారులకు అందజేయాల్సిందిగా చెప్పారు. అవసరమైతే వైద్యుల సలహాలు సూచనలతో కూడిన రిపోర్టు ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. పేషెంట్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటివరకు రూ.6,50,000/- ఆర్థిక సహాయం అందినట్టుగా తెలియజేశారు.

About Author