ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు…
1 min read– జిల్లా ఎస్పీ శ్రీ K. రఘువీర్ రెడ్డి IPS
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ K. రఘువీర్ రెడ్డి IPS ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి తమ ప్రాణాల సైతం త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుని స్మరించుకోవడం ఎంతైనా అవసరమని, పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ బోధించిన సత్యం,అహింస, హరిజనోద్దరన అనే ఆశయాల కొరకు కృషి చేసినాడు అని,భారత దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క త్యాగ ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము అని జిల్లా ఎస్ తెలియచేసినారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ G. వెంకటరాముడు , ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ జి .చంద్రబాబు ,డిఎస్పి రంగముని ,RI లు సుధాకర్ ,మంజునాథ్ , శ్రీనివాసులు మరియు ఆర్.ఎస్.ఐ లు అల్లావుద్దీన్ , దాదాపీరా ,సోమశేఖర్ ,వీరన్న ,హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.