విద్యాసంస్థల బంద్ విజయవంతం AISF,AIYF
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ వర్గ పరిధిలోని తుగ్గలి మద్దికేర క్రిష్ణగిరి వెల్దుర్తి పత్తికొండ బందు విజయవంతం అయ్యిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్ ఏఐవైఎఫ్ తాలూకా కార్యదర్శి అన్వేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్ తెలిపారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీగా నాలుగు స్తంభాల కూడలి దగ్గరికి ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ, దేశంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఉద్యోగాలు కల్పించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తానని అనేక హామీలు ఇచ్చి ఒక్క ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా,, ఈ రాష్ట్రంలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉపాధి కల్పిస్తూ వాళ్ల కుటుంబాలు పోషణకు ఆసరాగా నిలుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండో కుమ్మక్కై విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని చూడడం చాలా దారుణమని మండిపడ్డారు. అయ్యా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని విద్యార్థి యువజన సంఘాలు అనేక దఫాలుగా పోరాటాలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. అంతేకాకుండా ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను కార్పొరేట్ వ్యక్తులకు తాకట్టుపెట్టే యువచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు. మరోపక్క విభజన చట్టంలో హామీలు రాయలసీమలోని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ప్రారంభిస్తామని ఇప్పటికే అనేకసార్లు శంకుస్థాపనలు చేశారే తప్ప ఆచరణలో ప్రారంభించి పూర్తి చేసింది లేదని తెలిపారు. రాయలసీమ జిల్లాలో డిగ్రీలు పీజీలు పూర్తిచేసుకుని ఉద్యోగ అవకాశాలు లేక చెన్నైకు బెంగళూరుకు కేరళకు వలసలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే రాయలసీమలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు పెద్దయ్య, ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు సమీర్, మండల సహాయ కార్యదర్శి మా భాష, మండల ఉపాధ్యక్షుడు హరి, పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు నరేంద్ర, అహ్మద్, అరుణ్, చరణ్ ఏఐవైఎఫ్ తుగ్గిలి మండల అధ్యక్షులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.