‘నిరాశ్రయుల వసతి’ కి రైస్, కందిపప్పు వితరణ
1 min readపల్లెవెలుగు వెబ్, కల్లూరు: నిరాశ్రయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని కర్నూలు జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శిరీష అన్నారు. సోమవారం కర్నూలు నగరం అశోక్ నగర్ లోని పట్టణ మహిళా నిరాశ్రయ వసతి గృహాన్ని ఆమె సందర్శించారు. 25kg ల బియ్యము,2kgల కందిపప్పు, 4 ఆయిల్ ప్యాకెట్లను మెప్మా పీడీ శిరీష సొంత డబ్బుతో వితరణ చేశారు. ఈ సందర్భంగా పిడి శిరీష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్దులకు, ఒంటరి మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆనాధలు,అబాగ్యుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సంరక్షణ షెల్టర్లు ఏర్పాటు చేసి ఆదుకుంటుందన్నారు. అనంతరం వసతిగృహ నిర్వాహకురాలు గోరంట్ల శకుంతల మాట్లాడుతూ 4 సంవత్సరాలు నుండి బిల్లులు రావడం లేదని, షెల్టర్ కూడా రెన్యువల్ కాలేదన్నారు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. దాతల సహకారంతో వసతి గృహాన్ని కొనసాగిస్తున్నామని పీడీ శిరీష దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన పీడీ.. త్వరలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.