NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పద్మశాలీలు.. రాజకీయంగా ఎదగాలి

1 min read

– సమస్యల సాధనకు పోరాడాలి

  • పద్మశాలి సంఘం రాయలసీమ ప్రాంత అధ్యక్షుడు కొంకతి లక్ష్మినారాయణ
  •  ఎమ్మిగనూరులో ఘనంగా కార్తీక వన భోజన మహోత్సవం..

పల్లెవెలుగు, కర్నూలు: పద్మశాలిలు రాజకీయంగా… ఆర్ధికంగా.. సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు పద్మశాలి సంఘం రాయలసీమ ప్రాంత అధ్యక్షులు కొంకతి లక్ష్మి నారాయణ. ఆదివారం  ఎమ్మిగనూరు పట్టణంలో   పద్మశాలి 5వ కార్తీక వనభోజనం కార్యక్రమము వైభవంగా జరిగింది.   కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన  రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎమ్మిగనూరు నందు పద్మశాలీలు ఐక్యతకు ప్రతీకగా ఉన్నారు. పద్మశాలీలు కలిసి కార్తికమైన భోజనం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా  సంఘ అధ్యక్షులు విశ్వనాథం రమేష్​ను అభినందించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు కొంకతి బనకయ్య, శివ దాసు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఊట్ల రమేష్ బాబు, పులిపాటి నాగరాజు, ఎమ్మార్ మోహన్, ఈరన్న, పులికొండ తదితరులు పాల్గొన్నారు.

About Author