ప్రపంచంలోనే మన రాజ్యాంగం ఎంతో గొప్పది..
1 min readదేశం కోసం అసువులు బాసిన మహనీయులను స్మరించుకుందాం..
ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం వద్ద 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన అనంతరం జండా వందనం చేసి మాట్లాడారు. ప్రపంచ దేశాలలోనే మన రాజ్యాంగం ఎంతో గొప్పదని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వాలు మన భారత రాజ్యాంగం ద్వారానే సిద్ధించాయని, దేశం కోసం అసువులు బాసిన మహనీయులు వారి త్యాగాలను మనం ఎప్పుడూ స్మరించుకోవాలని విద్యార్థి దశ నుండే మనం త్యాగమూర్తుల అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. విద్య ద్వారానే మనం రాజ్యాధికారాన్ని సమానత్వాన్ని రాజ్యాంగం ద్వారా సిద్ధిస్తుందన్నారు. వైస్ చైర్మన్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ నేటి బాలలగా ఉన్న మీరు భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన కార్యాలయ సిబ్బందికి, అధికారులకు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ దంపతులకు పేరుపేరునా చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని జాతీయగీతం ఆలపించి అందర్నీ ఆకట్టుకున్నారు.