క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేద్దాం..
1 min readమరో 73 రోజుల్లో తిరుగులేని మెజారిటీతో టిడిపి జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది..
బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ అనేది ఒక మహత్తర కార్యక్రమంలో..
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన దెందులూరు నియోజకవర్గ బూత్ కన్వీనర్ల శిక్షణా కార్యక్రమంలోమండలాల వారీగా, పోలింగ్ బూత్ ల వారీగా కన్వీనర్ల పని తీరుని స్వయంగా పర్యవేక్షించిన చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూపార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లటంలో ప్రతి ఒక్కరూ కీలకపాత్ర పోషించాలని టీడీపీ శ్రేణులకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో బూత్ కన్వీనర్లు ప్రత్యేక చొరవ చూపించాలని, పార్టీ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని టిడిపి శ్రేణులకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు.ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం నాడు జరిగిన దెందులూరు నియోజకవర్గానికి చెందిన పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరాల మండలాల బూత్ కన్వీనర్ల ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చింతమనేని ప్రభాకర్ రాబోయే ఎన్నికల నేపద్యంలో అమలు చేయాల్సిన విధానముపై కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు. మండలాల వారీగా క్లస్టర్ ఇంచార్జ్లు, యూనిట్ ఇన్ఛార్జ్లు, బూత్ కన్వీనర్ల పని తీరును స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జగన్ రాక్షస పాలనను ప్రజలు పూర్తిగా అసహ్యించుకుంటున్నారని, మరో 73రోజుల్లో టిడిపి జనసేన కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. గత నాలుగున్నారేళ్లుగా ఈ వైసిపి అవినీతి అరాచక పాలనను ప్రజల్లో ఎండ గట్టడంలో ప్రతి టిడిపి కార్యకర్త ఎంతో కృషి చేసారని, గడిచిన 58నెలలు ఒక ఎత్తయితే, రాబోయే 73 రోజులు మరింత ముఖ్యం అని అన్నారు.బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ అనేది ఒక మహత్తర కార్యక్రమం అని, చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన 6పధకాల విశిష్టతను ప్రతి కుటుంబానికి వివరించి, గ్యారంటీ పత్రాలు అందచేయాలని సూచించారు. 2024 ఎన్నికల్లో దెందులూరులో మన విజయం ఖరారు అయిపోయింది కాబట్టి, ఇప్పటి నుంచే ఎవరూ అలసత్వం ప్రదర్శించ కూడదని, విజయంతో పాటు మన బలాన్ని మెజారిటీ రూపంలో చూపించాలని, బూత్ కన్వీనర్లు తమ పరిధిలోని ప్రతి ఓటరు పోలింగ్ బూత్ కి చేరుకుని మనకు ఓటు వేసే వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బూత్ కన్వీనర్లకు పూర్తి అందుబాటులో ఉండి సహకరించాల్సిన భాద్యత యూనిట్ ఇన్ఛార్జ్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, మండల పార్టీ అధ్యక్షులకు ఉంటుందని చింతమనేని ప్రభాకర్ సూచించారు. పనితీరులో 85% పైగా మార్కులు సాధించిన బూత్ కన్వీనర్లు ఎంతో మంది ఉన్నారని, అలాంటి వారి పని తీరుని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు పార్టీకోసం సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. బూత్ కన్వీనర్ల స్థాయి నుంచి ప్రతి ఒక్కరి పనితీరుని స్వయంగా పర్యవేక్షించటం జరుగుతుందని,పార్టీకోసం నిస్వార్ధంగా కృషిచేసే ప్రతి ఒక్కరికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాగంటి మిల్లు బాబు, లావేటి శ్రీనివాస్, నంబూరి నాగరాజు, బొప్పన సుధా, పార్లమెంటరీ సెక్రటరీ మోరు శ్రావణి, సమన్వయకర్త ఉప్పలపాటి రాంప్రసాద్, కోర్డినెటర్ వై.వి.యార్, క్లస్టర్ ఇన్ఛార్జ్లు మంచినేని శ్రీనివాస రావు, ఐనాల వెంకట నారాయణ, తాతా సత్యనారాయణ, కనికొల్ల శివమణి, బొడ్డెటి మోహన్ బాబు, గారపాటి కొండయ్య , పరసా వెంకట రావు, ముళ్ళపూడి సాంబశివరావు, మందపాటి వెంకట స్వరరావు, గుత్తా అనిల్ కుమార్ సహా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.