61 లక్షల రూ. వ్యయంతో భవన నిర్మాణ శంకుస్థాపన..
1 min readశంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పాల్గొన్న జాయింట్ కలెక్టర్ పి లావణ్య
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో 61 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కాంపిటీషన్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్ (CALA) విభాగం భవన నిర్మాణ పనులకు గురువారం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి తో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జాతీయ రహదారుల శాఖకు సంబంధించి కాంపిటీషన్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్ (CALA) విభాగం కార్యాలయం నూతన భవనం నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయడం జరిగిందన్నారు. భవన నిర్మాణ పనులను జిల్లా గృహ నిర్మాణ శాఖకు అప్పగించారు. భవన నిర్మాణాన్ని నిర్దేశించిన సమయంలోగా నిర్మించాలని, నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ రవికుమార్, విజిలెన్స్ ఎస్పి కరణం కుమార్, ఏలూరు ఆర్డీవో.ఎన్ .ఎస్.కె. ఖాజావలి,డి.ఎస్.పి వెంకటేశ్వరరావు ఐసిడిఎస్ పిడి పద్మావతి, డి ఎం సివిల్ సప్లైస్ మంజుభార్గవి, గృహ నిర్మాణ శాఖ ఈఈ రమణమూర్తి , డి ఈ రామకృష్ణ. కాంట్రాక్టర్ తులసీరామ్. తదితరులు పాల్గొన్నారు.