శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఆర్ జె డి
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో జరగబోయే శివరాత్రి ఏర్పాట్లను తిరుపతి మల్టీ జోన్2 రీజనల్ జాయింట్ కమీషనర్ చంద్ర శేఖర ఆజాద్ పరిశీలించారు.మంగళవారం మహానంది క్షేత్రానికి వచ్చిన ఆయన ఆలయ ఈఓ శ్రీనివాస రెడ్డి తో కలసి ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. సామాన్యభక్తులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ప్రతి భక్తుడికి ప్రసాదం అందేలా చూస్తామన్నారు. అమ్మవారి ఆలయం, కోదండ రామాలయంలో ఉన్నటువంటి శిల్ప కలను చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మండపాలలో ఉన్నటువంటి పురాతన శిల్పాలను ప్రత్యేకంగా పరిశీలించారు. శానిటేషన్, క్యూ లైన్ల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.అన్నవితరణ కేంద్రాన్ని పరిశీలించి రుచులు బాగున్నాయని కితాబునిచ్చారు.అంతకు ముందు శ్రీకామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఏ ఈఒ మధు, సూపర్డెంట్లు శశిధర్ రెడ్డి,దేవిక, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ఆర్ ఎస్ శ్రీనివాసులు, శ్రీశైలం శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, మల్లయ్య,ఏ ఈ శ్రీనివాసులు, మల్లికార్జున, తదితరులు ఉన్నారు.