జిల్లాలోని మామిడి రైతులను ఆదుకోవాలి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/10-5.jpg?fit=550%2C328&ssl=1)
మామిడి రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్
పల్లెవెలుగు,ఏలూరు జిల్లా ప్రతినిధి: జిల్లాలోని మామిడి రైతులను ఆదుకోవాలని, మామిడి పంటకు ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం పెదవేగి మండలంలోని పెదవేగి, గార్లమడుగు తదితర గ్రామాల్లో మామిడి తోటలను ఆయన పరిశీలించారు. మామిడి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం కె. శ్రీనివాస్ జిల్లాలో 35వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు ఉన్నాయని చెప్పారు.గత మూడు సంవత్సరాల కాలంగా మామిడికి గులాబీ రంగు పురుగు, తామర పురుగు, ముడి పుచ్చు ,వ్యాధులు సోకి పుతనల్లగా మాడిపోయి దిగుబడులు లేక మామిడి రైతులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించిందని నేటికీ అమలయ్యే పరిస్థితి లేదన్నారు.ఆచరణలో లేని ఉచిత బోర్లు ,డ్రిప్ వంటి పరికరాలు సబ్సిడీ మీద అందించడం లేదన్నారు. మామిడిసోకే చీడపీడలపై ఉద్యానవన శాఖ ద్వారా రైతుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని కోరారు. నల్ల తామర పురుగు నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టాలన్నారు.మామిడి రైతులు నష్టపోకుండా చూడాలన్నారు.మామిడి తోటలకు ఉచిత పంటల బీమా సౌకర్యం కల్పించాలన్నారు.మామిడి రైతులకు ఉచిత బోర్లు పథకం అమలు చేయాలన్నారు. 3)ఎకరానికి 50 వేల 4)మామిడికి సోకే తెగుళ్లు నివారించడానికి ఉద్యానవను శాఖ వారు రైతులలో అవగాహన కల్పించాలి. మామూలు రైతులకు తగిన మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస ధరలు అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.