NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన చిత్ర నిర్మాణానికి ప్రొడెక్షన్ నెంబర్-1 ప్రకటించిన సినీనిర్మాత

1 min read

తోక వెంకటేష్ దర్శకుడు అజయ్ సూర్య

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుందలోని శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవం నాడు సినీ నిర్మాత తోక వెంకటేష్  నిర్మాణము అజయ్ సూర్య దర్శకత్వంలో నూతనంగా నిర్మిచబోతున్న చలనచిత్రానికి శుక్రవారం నాడు శ్రీ సిద్దేశ్వర సన్నిధిలో తోటి దర్శకుడు హసన్  సినిమా సినీనటుల బృందం హీరోయిన్ – ఐశ్వర్య హీరో – తిరు, కెమెరామాన్ – తేజ, అసిస్టెంట్ కెమెరామెన్ – షామీర్ మరియు గ్రామపెద్దలు రాజా పంపనగౌడ్, సబ్ ఇన్స్ పేక్టర్ బాలనరసింహులు, చిన్నహ్యట శేషగిరి, గోపాల్ రెడ్డి, డాక్టర్ తిప్పయ్య, సిద్దార్థగౌడ్, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొని నూతన చలనచిత్ర నిర్మాణపు ప్రోడక్షన్ నెంబర్-1 ను ఆవిష్కరణతో ప్రకటించి స్క్రిప్ట్‌ పూజా కార్యక్రమం నిర్వహించారు.నిర్మాత తోక వెంకటేష్, దర్శకుడు అజయ్ సూర్య, మేనేజర్ ఖాదర్ బాష’లు మాట్లాడుతూ నవరంగులతో నవలోకాలను తెరపై చిత్రించి, నటనతో భావోద్వేగాలను ఆవిష్కరించి,ఊహకందని కల్పితాలను కనుల ముందు కనువిందు చేసి, చరిత్ర మరిచిన కథలను, పౌరాణిక కథలను, ప్రేమ కథలను. ప్రదర్శించి, ఇరవై నాలుగు విభాగల్లో అరవై నాలుగు కళలకు ప్రతీకగా నిలిచే నవరసాల సమ్మేళన చలన చిత్రాన్ని మా బృందమంత కష్టపడి 1995లో జరిగే తల్లి ప్రేమతో కూడిన ప్రేమ కథ చిత్రంగా మీ ముందుకు తెరపై తీసుకువస్తున్నాము, కావున ప్రజలందరూ ప్రేమాభిమానాలతో ఈ కొత్త సినిమా ప్రయాణాన్ని ప్రారంభించేందుకు తమని ఆదరించాలని కోరుతూ, తమ నూతన చిత్ర నిర్మాణంలో నటనకై ఉత్సాహము కలిగిన నటినటులకై త్వరలోనే వివిధ నగరాల్లో సినిమా ఆడిషన్స్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తోక వీరేష్, డ్యాన్స్ మాస్టార్ గోవర్ధన్, చిత్రబృందం సభ్యులు రసూల్ మరియు పెద్దలు దుర్గయ్య,అశోక్,బాగోడి రాముడు, కుమారి, తదితర నాయకులు, గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author