పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్ థియేటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/6-7.jpg?fit=550%2C309&ssl=1)
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ థియేటర్ ను స్థానిక ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటి సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న మహిళకు మగ పిల్లవాడు జన్మనిచ్చాడని ఆ బాబుకు ఎమ్మెల్యే నగదును అందజేశాడు. అనంతరం డాక్టర్లతో సమావేశం నిర్వహించాడు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలలో సిజరిన్ ఆపరేషన్లు జరగక ఐదు సంవత్సరాలు అవుతుందని గత వైసిపి ప్రభుత్వం లో ప్రభుత్వ వైద్యశాలకు నిధులు రాక ఆపరేషన్లు నిలిచిపోయాయని ఆయన అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సిజరిన్ ఆపరేషన్లు ప్రభుత్వ వైద్యశాలలో జరిగేటట్లు ఏర్పాట్లు చేశామని తెలిపారు.మౌలిక సదుపాయాలు, టెక్నికల్ సిబ్బంది ఎంతమంది ఉన్నారని తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసి మందులు సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై అక్కడున్న రోగులతోనూ మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు, వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆస్పత్రికి రోజుకు 600 నుంచి 900 మంది రోగులు వస్తున్న నేపథ్యంలో అవసరమైతే మరింత మంది డాక్టర్లను నియమిస్తామన్నారు. వైద్య సేవలు, సదుపాయాల పై కల్పన డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పత్తికొండ డివిజన్ కేంద్రం లోని ప్రభుత్వ వైద్యశాలను ముప్పై పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. అనంతరం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే కె శ్యాం కుమార్.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/61-3.jpg?resize=550%2C309&ssl=1)