గురుకులంలో..అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ
1 min read
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాల బాలికల గురుకుల పాఠశాలల్లో (ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఈఐఎస్)ఐదవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం 2025-26 ప్రవేశాలకు గాను అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురం బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వి వెంకట రమణమ్మ మరియు జూపాడు బంగ్లా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పి సత్య నారాయణమూర్తి అన్నారు.5వ తరగతిలో చేరదలచిన విద్యార్థులు ప్రస్తుతం నాలుగో తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరదలచిన విద్యార్థులు ప్రస్తుతం 10వ తరగతి చదువుతూ ఉండాలన్నారు.వచ్చే నెల మార్చి 6వ తేదీ వరకు దరఖాస్తులను apgpcet.apcfss.in ఆన్ లైన్ చేయాలని అన్నారు. తర్వాత ప్రవేశ పరీక్ష ద్వారా మార్కులను బట్టి విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
