జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/10-8.jpg?fit=550%2C249&ssl=1)
పోలీస్ లైన్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు నులిపురుగుల పంపిణీ
పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి ఆర్.మాలిని
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం రిజర్వ్ పోలీసులైన్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు పిల్లలకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేశారు.ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. మాలిని మాట్లాడుతూ ఆరోగ్యమే మహా మహాభాగ్యమని పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని పిల్లలకు నులిపురుగు మాత్రలు ప్రతి సంవత్సరం వేయిస్తున్నామని తెలిపారు.ఈ నులి పురుగులు ఎలా ఏర్పడతాయి అలాగే వాటి వల్ల కలిగే వ్యాధుల గురించి వివరించారు వాటితో పాటు చేతులు ఎలా శుభ్రపరుచుకోవాలి తదితర ఆరోగ్య జాగ్రత్తలపై విద్యార్థులకు ఆమె వివరించారు.ముందుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. మాలిని, మరియు ప్రోగ్రాం అధికారి డా : నరేంద్ర కృష్ణ టాబ్లెట్ వేసుకుని ఆ తరువాత పిల్లలకు టాబ్లెట్స్ వెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో సురేష్ బహుగుణ స్కూల్ ప్రిన్సిపల్ వెంపటి స్రవంతి మరియుఆర్ బి ఎస్ కె జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా:నరేంద్ర కృష్ణ , నరసింహారావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రగతి, జిల్లా మేనేజర్నరేష్. బొప్పన, తదితరులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/101-1.jpg?resize=550%2C249&ssl=1)