సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయండి
1 min read
నగర కాంగ్రెస్ అధ్యక్షులు.. షేక్ జిలాని భాష
పల్లెవెలుగు , కర్నూలు: సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష డిమాండ్ చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ వద్ద జరిగిన సూపర్ సిక్స్- సూపర్ ప్లాప్ ధాళిబజావో కార్యక్రమంలో జిలాని భాష గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని ధాళిబజావో కార్యక్రమం చేపట్టడమైనదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా ఇంతవరకు ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ అమలు కాని హామీలు ఇచ్చి అందల మెక్కిందని విమర్శించారు. 9 నెలలు అవుతున్న ఉచిత బస్సు హామీ ఏమైందని, సంవత్సరానికి, మూడు సిలిండర్లు అన్నారు ఎక్కడున్నాయని ప్రశ్నించారు, ప్రతి విద్యార్థికి 15000 ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వేల రూపాయలు ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. రైతుబంధు 25000 అన్నారు. పంటసాయం అన్నారు ఎక్కడ ఇచ్చారని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 చెప్పారని.. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంతకు ముందు కలెక్టరేట్ ఎదురుగా గల మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్లేట్లను, గరిటలతో వాయిస్తూ సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని సూపర్ సిక్స్ సూపర్ ప్లాఫ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు నియోజక వర్గాల కోఆర్డినేటర్లు ఎం కాశీం వలి, బి క్రాంతి నాయుడు, యు లక్ష్మీనారాయణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఎన్ సి బజారన్న, మైనార్టీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కే రాఘవేంద్ర రెడ్డి, మహిళా కాంగ్రెస్ ఎస్ ప్రమీల, ఏ వెంకట సుజాత, ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న కాంగ్రెస్ నాయకులు కే వెంకటరెడ్డి, రియాజుద్దీన్, అనంతరత్నం మాదిగ, ఈ లాజరస్, ఖాద్రీ పాషా, ఆర్ ప్రతాప్, మా భాష, గోవిందు మహిళా కాంగ్రెస్ లలిత, పద్మ, లక్ష్మి మొదలగు పాల్గొన్నారు.