విద్యార్థినీ విద్యార్థులు మంచి లక్ష్యంతో ముందుకెళ్లండి
1 min read
పల్లెవెలుగు , హొళగుంద: విద్యార్థిని విద్యార్థులు మంచి లక్ష్యంతో ముందుకెళ్లాలని మండల విద్యాధికారి జగన్నాథం అన్నారు ఉన్నారు మంగళవారం సాయంత్రం మండల కేంద్రమైన హోలగుందలో అంబేద్కర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, మరియు వరలక్ష్మి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సౌజన్యంతో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు హాస్టల్లో సౌకర్యాల గురించి విద్యార్థిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అన్ని సౌకర్యాలు బాగున్నాయి మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాము విద్యార్థులు చెప్పడంతో ఆనందం వ్యక్తం చేశారు కాసేపు విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థులకు సలహాలు సూచనలు చేస్తూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇప్పటినుండి మంచి లక్ష్యంతో ముందుకెళితే సాధ్యపడనిది అంటూ ఏదీ లేదన్నారు పదవ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయితే స్వయంగా నేనే మిమ్మల్ని గుర్తించి బహుమతులు ప్రధానం చేస్తానని ప్రోత్సహించారు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని సూచించారు అనంతరం ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ సహకారంతో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్కులు, మరియు గత వారంలో జరిగిన ఆట పోటీల్లో గెలపొద్దిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు సిహెచ్ నాగరాజు, సి అర్ పి లు ఎం, లక్ష్మప్ప. తుకారం. రేణుక, సీజనల్ హాస్టల్ ఉపాధ్యాయులు దుర్గయ్య సోహెబ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.