పీ4’ సర్వేకు నగర ప్రజలు సహకరించాలి
1 min read
నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు నగరపాలక సంస్థ;
పల్లెవెలుగు , కర్నూలు: గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నగరంలో గురువారం నుండి పబ్లిక్ – ప్రైవేటు – పీపుల్స్ – పార్టనర్షిప్ (పీ4) సర్వే ప్రారంభమైందని, దీనికి నగర ప్రజలు సహకరించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేదరిక నిర్మూలనలో భాగంగా అత్యున్నత ఆర్థిక స్థానాల్లో ఉన్నవారిలో 10% మంది, అట్టడుగున ఉన్న వారిని 20% మందికి చేయూత అందించుట, ప్రతి ఇంటి వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయుట, ప్రభుత్వ ప్రాజెక్టుల ద్వారా అవసరమైన కుటుంబాలకు ప్రైవేట్ రంగ సహాయాన్ని అందించడం వంటి లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి ఇంటి వద్దకు సచివాలయ కార్యదర్శులు వస్తారని, వారు కోరిన సమాచారాన్ని ప్రజలు అందించాలని సూచించారు. వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ సర్వే జరుగుతుందని, పేదరిక నిర్మూలనకు ఎంతగానో దోహదపడే ఈ సర్వేకు నగర ప్రజానీకం సహకరించాలని కమిషనర్ కోరారు.