NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేర నియంత్రణకు గట్టి గా పని చేయాలి …

1 min read

జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్

పోలీసు అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించిన … జిల్లా ఎస్పీ.         

పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి.

కర్నూలు న్యూస్​ నేడు: నేర నియంత్రణకు ప్రతి ఒక్కరూ గట్టిగా పని చేయాలని, పెండింగ్ కేసులు తగ్గించాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  అన్నారు. ఈ సంధర్బంగా శుక్రవారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలో  వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని  డిఎస్పీలు,  సిఐలు, ఎస్సైల తో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు  పోలీసు అధికారులతో  మాట్లాడారు.  కర్నూలు , పత్తికొండ , ఆదోని , ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో  దీర్ఘకాలంగా ఉన్న  పెండింగ్‌ కేసుల  గురించి  జిల్లా ఎస్పీ   సమీక్షించి ఆరా తీశారు. పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పలు సలహాలు,  సూచనలు చేశారు. కేసుల వివరాలను  CCTNS లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.గ్రేవ్ కేసులు, యు ఐ కేసులు, మర్డర్ , రోడ్డు ప్రమాదాలు , పోక్సో కేసులు , మిస్సింగ్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, డ్రంకెన్ డ్రైవ్ కేసులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎదైనా  విషయం పై పోలీసు అధికారులను  వివరాలను అడిగినప్పుడు సరైన సమాచారం ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజలతో పాటు పోలీసు సిబ్బంది కూడా ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు లైసెన్స్ లు, హెల్మెట్ లు కలిగి ఉండాలన్నారు.డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్  ఆయా పోలీసుస్టేషన్ల పరిధులలో  తనిఖీలు నిర్వహించాలన్నారు.సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పటికప్పుడూ పెండింగ్ కేసుల వివరాలను టెలికాన్ఫరెన్స్ లో అడిగి తెలుసుకుంటామన్నారు. పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు.ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా,  ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు,  డిఎస్పీలు జె. బాబు ప్రసాద్, కె. శ్రీనివాసాచారి, హేమలత, భాస్కర్ రావు,  ట్రైనీ డీఎస్పీ ఉష శ్రీ ,  సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.

About Author