6 న..బిసివై పార్టీ సమావేశాన్ని జయప్రదం చేయండి
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: బిసివై పార్టీ యువత కోసం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నూతన కమిటీలను నిర్వహించడానికై మార్చి 6 వ తేదీన విజయవాడలోని యన్టీఆర్ కాలనీ ఎన్హెచ్ 16 సర్వీస్ రోడ్డు నందు పార్టీ బలోపేతం చేయడానికి మరియు రాష్ట్రంలో వున్న ఎక్కువ శాతం బిసీల అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో బిసీలు ముఖ్యమంత్రి కావాలని గొప్ప ధృఢ సంకల్పంతో మన బిసి నాయకుడు బోడె రామచంద్ర యాదవ్ ఈ సమావేశాన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున కర్నూలు జిల్లా నుంచి ఎక్కువ శాతం యువకులందరూ జరగబోయే సమావేశంలో పాల్గొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బిసివై పార్టీ నుంచి బాధ్యతలను తీసుకుని యువకులంతా నాయకులుగా ఎదగాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.