NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెవెన్యూ శాఖకు సంబంధించి అర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలి

1 min read

నియమ నిబంధనల ప్రకారం  రైతులకు ఇబ్బందులు కలగకుండా రీ సర్వే పక్కాగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు : రెవెన్యూశాఖకు సంబంధించి వచ్చే  అర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.మంగళవారం వెల్దుర్తి తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిజిఆర్ఎస్ కి సంబంధించి  వెల్దుర్తి మండలంలో మాత్రం సర్వే కి సంబంధించిన అర్జీల పరిష్కారం గడువు దాటడం తో  కలెక్టర్  సర్వేయర్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.. సర్వేయర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, సంజాయిషీ అడగాలని కలెక్టర్ కర్నూలు ఆర్ డి ఓ ను ఆదేశించారు… రీ సర్వే గ్రామసభలు, రెవెన్యూ సదస్సులకి సంబంధించిన వివరాలు గ్రామాల వారీగా  లేకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.. నివేదికలను సక్రమంగా రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. జిల్లాలో రెవెన్యూ సర్వీస్ లకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లకు సంబంధించిన దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఏ లో 85  గడువు దాటి ఉన్నాయని, ఈ అంశం పై సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ కర్నూలు ఆర్డీఓ ను, ఫోన్ ద్వారా డిఆర్వో ను    ఆదేశించారు.పీజీఆర్ఎస్ కి సంబంధించి ఒక అర్జీ విలేజ్ సర్వేయర్ లాగిన్ లో చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉండడం గమనించి  వెంటనే ఆ విలేజ్ సర్వేయర్ ను సస్పెండ్ చేయాలని  కలెక్టర్ కర్నూలు ఆర్డీఓ ను ఆదేశించారు…పీజీఆర్ఎస్ కి సంబంధించి అర్జీల వివరాలపై వీఆర్వో లకు పూర్తి అవగాహన ఉండాలని  కలెక్టర్ ఆదేశించారు.వెల్దుర్తి మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామంలో రీ సర్వే పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? గ్రౌండ్ ట్రూతింగ్ పనులు మొదలు పెట్టారా? రోజుకి ఎన్ని ఎకరాలు రీ సర్వే చేస్తున్నారు? ఎన్ని రోవర్లు ఉన్నాయి?ఎన్ని టీమ్ లు ఉన్నాయి? గ్రౌండ్ వ్యాలిడేషన్ కి ఎంత సమయం పడుతోంది? రీ సర్వే సమయంలో  రైతులకు ముందుగానే నోటీసులు ఇస్తున్నారా?? అనే విషయాలను కలెక్టర్ తహశీల్దార్, మండల సర్వేయర్ లను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కార్యాలయ సిబ్బంది గదులను పరిశీలిస్తూ ఎంతమంది వీఆర్వోలు ఉన్నారు?  కార్యాలయంలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు అని కలెక్టర్ తహశీల్దార్ ను ఆరా తీశారు. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వద్ద ఉన్న మ్యూటేషన్ రికార్డ్స్ ను పరిశీలిస్తూ, ప్రతి మ్యూటేషన్ కు పక్కగా ఫైళ్లు నిర్వహించాలని,పి జి ఆర్ ఎస్ కు సంబంధించి వచ్చిన దరఖాస్తులను రిజిస్టర్noo  నమోదు చేసుకోవాలని, రికార్డ్స్ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని కలెక్టర్  సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్  వెంట అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, మండల తహసిల్దార్ చంద్రశేఖర వర్మ, ఎంపీడీవో సుహాసిని, తదితరులు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *