NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహిద్దాం..

1 min read

మహిళా దినోత్సవానికి విస్త్రృత ఏర్పాట్లు

అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా  ప్రతినిధి న్యూస్​ నేడు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన ఏలూరు సర్. సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యాన వివిధ శాఖల సమన్వయంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. వివిధ శాఖల ఆద్వర్యంలో సుమారు 25 స్టాల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. చేనేత వస్త్రాలు, హస్తకళలకు సంబంధించిన స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. మహిళల్లో చైతన్యం కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా 2కె మారధన్, సైకిల్ ర్యాలీ వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  మహిళలకు హెల్త్ చెకప్ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కు సంబంధించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.  న్యూట్రిషన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు.  వివిధ రంగాల్లో సత్తాచాటుతున్న మహిళలను సన్మానించాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ తో పాటు మొక్కలు పెంచేందుకు అనువుగావున్న అన్ని కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలన్నారు. మహిళా దినోత్సవ కార్యక్రమంలో మహిళలతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులందరూ తప్పక హాజరు కావాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, ఐసిడిఎస్ పిడి పి. శారద, డిఎస్పీ శ్రావణ్ కుమార్, డిసిపివో డా. సూర్యచక్రవేణి, ఇరిగేషన్ ఎస్ఇ పి. నాగార్జునరావు, ఎల్డిఎం డి. నీలాధ్రి, పరిశ్రమల కేంద్రం జియం సుబ్రహమణ్యేశ్వరరావు, వ్యవసాయశాఖ జెడి హబీబ్ భాషా, ఉధ్యానశాఖ డిడి రామ్మోహన్, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, తోపాటు పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author