NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళా శక్తికి మూలాధారం.. ఆరోగ్యమే..

1 min read

 కిమ్స్​ కన్సల్టెంట్ అబ్ స్ట్రిషన్ &  గైనకాలజిస్ట్   డా. వై. కుసుమ, కర్నూలు

– మార్చి8న  అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆరోగ్యమే మహిళా శక్తికి ములాధారం! మహిళలు కుటుంబాన్ని, సమాజాన్ని పటిష్ఠంగా నిలబెట్టే శక్తి కలవారు. ప్ర‌తి ద‌శ‌లోనూ బాలిక‌లు, మ‌హిళ‌ల‌కు కొన్ని ప్ర‌త్యేక‌మైన అవ‌స‌రాలు, అవ‌కాశాలు ఉంటాయి. వాటిద్వారా వాళ్లు త‌మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బాల్యం, కౌమారం, పిల్ల‌లు పుట్టే వ‌య‌సు, మెనోపాజ్, ఆ త‌ర్వాతి ద‌శ‌ల్లో మ‌హిళ‌లు త‌మ ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవాలి.

నిత్యం ఎన్నో పనులతో సతమతమవుతూ…

 తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మహిళలు. అలాగే ఐటి రంగాల్లో పని చేస్తే స్త్రీలు కూడా తమ ఆరోగ్యానికి తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇటీవల కాలంలో తమ దగ్గరికి వివిధ రకాల సమస్యలతో వచ్చిన వారిలో గృహిణీలతో పోలిస్తే… ఉద్యోగాలు చేసే వారే ఎక్కువ మంది ఉంటున్నారు. అలాగే మారుతున్న జీవనశైలిలో ఆహారపు అలవాట్లు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్లలో పని చేసే వారు ఎక్కువ సేపు కూర్చున్న సీటుకే పరిమితం కావడం, అక్కడి కార్యాలయాల్లో అందుబాటులో ఉండే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళల్లో ప్రధానంగా పిల్లలు లేకపోవడం, రుతుక్రమం సరిగా రాకపోవడం, గర్భశాయ సమస్యలు, ఎక్కువసేపు నిలబడలేకపోవడం, నడవలేకపోవడం, ఒళ్లు నొప్పులు వంటివి ప్రధానంగా నేటి మహిళలు ఎదుర్కొంటున్నారు.

 తీసుకోవాల్సిన…జాగ్రత్తలు..

–       నియమిత ఆరోగ్య పరీక్షలు – హృదయ ఆరోగ్యం, గర్భాశయ ఆరోగ్యం, ముడిపడే వ్యాధులను నిర్ధారించుకునేందుకు

–       సంతులిత ఆహారం & వ్యాయామం – శక్తి & మానసిక స్థిరత్వానికి

–       మానసిక ఆరోగ్య శ్రేయస్సు – ఒత్తిడిని తగ్గించుకోవడం, సరైన విశ్రాంతి తీసుకోవడం

–       ఆరోగ్యకరమైన జీవనశైలి – పానీయాలు, పోషకాహారం, హార్మోన్ల సమతుల్యత

About Author