ఘనంగా కర్నూలుకు సిలువ పాద యాత్ర..
1 min read
మానవుల కొరకే ఏసుక్రీస్తు శిలువపై బలి:బిషప్ జ్వాన్నేష్
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ విచారణలో ఉన్న 10 గ్రామాల మరియదళం సభ్యులు మరియు విశ్వాసులు శుక్రవారం ఉదయం 6 గం.కు దేవనూరు గ్రామం నుండి సిలువ పాదయాత్ర ప్రారంభమై చౌటుకూరు,49 బన్నూరు,కడుమూరు, ఉప్పలదడియ,దిగువపాడు, గార్గేయపురం మీదుగా రోడ్డు మార్గాన ఏసుక్రీస్తు సిలువపై పడిన బాధలు 14 స్థలాలను గుర్తుకు తెచ్చుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్లారు.ఉప్పలదడియ ఆర్సిఎం విచారణ గురువులు డి మధుబాబు ఆధ్వర్యంలో తపస్సు కాల మొదటి శుక్రవారం రోజున పాదయాత్ర జరిగింది.కర్నూలు చెక్ పోస్ట్ బిషప్ హౌస్ దగ్గరికి 6 గంటలకు చేరుకున్నారు.రాత్రి ఏడు గంటలకు బిషప్ హౌస్ లో బిషప్ గోరంట్ల జ్వాన్నేష్,పరిశుద్ధ లూర్థు మాత కథిడ్రల్ విచారణ గురువులు ఎస్ దేవదాసు, బిషప్ హౌస్ సెక్రటరీ గురువులు ఈగల పాటి ప్రవీణ్,ఫాదర్ మధుబాబుదివ్య బలిపూజను సమర్పించారు.ఈ సందర్భంగా మానవులు చేసిన పాపాల కొరకే సిలువపై ఏసుక్రీస్తు బలి అయ్యారని ఈ నెల రోజుల తపస్సు కాలంలో ప్రతి మానవునికి ప్రార్థనఉపవాసం, దాన ధర్మాలు ముఖ్యమని వీటిని ప్రతి ఒక్కరూ ఆచరిస్తే కుటుంబాల్లో దేవుని యొక్క దీవెనలు అధికంగా ఉంటాయని బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ వాక్య పరిచర్య చేసిన అనంతరం విశ్వాసులకు దివ్య సత్ప్రసాద అప్పమును అందజేశారు. కేడిఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ సుధాకర్,జీవసుధ పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ బాలరాజు,ఫాదర్ రాజేంద్ర ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పలదడియ విచారణలోని 10 గ్రామాల విశ్వాసులు,ఉపదేశులు తదితరులు పాల్గొన్నారు.
