ఏపీ విద్యుత్ పంపిణి సంస్ధ ఉద్యోగుల ఆధ్వర్యంలో మజ్జిగా చలివేంద్రం..
1 min readవేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం
డిఆర్డిఏ పిడి డాక్టర్: ఆర్.విజయరాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణి సంస్ధ ఏలూరు సర్కిల్ ఉద్యోగుల ఆద్వర్యంలో మజ్జిగా చలివేంద్రన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమనిడి ఆర్డిఏ పిడి డాక్టర్ ఆర్.విజయరాజ అన్నారు. ఏలూరు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద సోమవారం ఏ పి ఈపీడిసిఎల్ ఏస్ ఈ సాల్మన్ రాజు తో కలిసి డి.ఆర్.డి.ఎ పిడి డాక్టర్ ఆర్.విజయరాజు మజ్జిగా చలివేంద్రం లో మజ్జిగను పంపిణి చేశారు. ఈ సందర్భంగా డి ఆర్ డి ఎ పిడి డాక్టర్ ఆర్.విజయ రాజు మాట్లాడుతూ ఇ.పి.డి.సి.ఎల్ ఉద్యోగులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగా చలివేంద్రం ఎండలకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈపీడీసీఎల్ ఉద్యోగులు ముందుకు వచ్చి ప్రజలు ఎక్కువగా సంచరించే ఆర్ ఆర్ పేట (మెయిన్ రోడ్డు) శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మందికి దాహార్తి ని తీర్చేందుకు ఎంతగానో దోహద పడుతుందన్నారు. ఈ సందర్భంగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన ఈపీడీసీఎల్ ఉద్యోగులను ఆయన అభినందనందిచారు. ఇ.పి.డి.సి.ఎల్ ఎస్.ఈ సాల్మన్ రాజు మాట్లాడుతూ ఏలూరు సర్కిల్ ఉద్యోగులు బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన మజ్జిగా చలివేంద్రం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.